లక్ష్యం:

ఈ పాఠ్యాంశంలో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ని తెలుగులోకి ఎలా
అనువదించుకోవాలో తెలుసుకుందాం. అంటే ప్రస్తుతానికి ఇంగ్లీషులో కనబడేవన్నీ
ఇకపై తెలుగులో కనబడతాయన్నమాట. ఐతే, మీరు ఇంగ్లీషులో రాసుకున్న ఫైల్స్,
వాటికి, ఫోల్డర్లకి ఇంగ్లీషులో పెట్టుకున్న పేర్లు వగైరాలు మాత్రం అలాగే
ఉంటాయి సుమా! విండోస్ ఇన్‌స్టాల్ చేసుకోవడంతోనే వచ్చేవి మాత్రమే
అనవదింపబడతాయి. మీరు స్వయంగా తర్వాత రాసుకున్నవి, కాపీ చేసుకున్నవి ఏవీ
మారవు. కాబట్టి మీరు నిరభ్యంతరంగా, నిస్సంకోచంగా ఈ పాఠ్యాంశాన్ని
అనుసరించవచ్చు.
- మీరు ఈ లంకెకు Internet Explorer లో వెళ్ళి Localization Language Offerings అన్న లంకె మీద నొక్కితే అక్కడ ప్రపంచపఠం ఒకటి ప్రత్యక్షమౌతుంది.
- భారతదేశం ఉన్న రంగు మీద నొక్కితే పక్కనే ఉన్న Step 2 లో Asian Languages అని వస్తుంది. దాని మీద నొక్కితే తెలుగు అని కనబడుతుంది. అది ఎంచుకోండి.
![]() | ![]() |
- అదవ్వగానే కింద ఉన్న Step 3 లో, మీ సిస్టమ్ విస్టా ఐతే విస్టా, ఎక్స్.పీ ఐతే ఎక్స్.పీ ఎంచుకోవాలి.

- ఒకవేళ ఇక్కడ కింద చూపిన విధంగా కాకుండా, search results ఉన్న పేజీ వస్తే ఈ లంకె మీద నొక్కండి. "ఇది తెలిసినప్పుడు ఈ ముక్కేదో ముందే చెప్పొచ్చుకదా, ఆ సుత్తంతా ఎందు"కంటారేమో, మీరు ఇది ఎక్కడ దొరుకుతుందో తెలుసుకోగలిగితే భవిష్యత్ లో స్వయంగా కొన్ని సమస్యలు పరిషరించుకోగలుగుతారు, అందుకన్న మాట!

- అదయిన తర్వాత అసలు మీ కంప్యూటర్లో ఉంది నకిలీ విండోసా, డబ్బెట్టి కొనుక్కున్న నికార్సైన విండోసా అని పరీక్షించడానికి ఏవో చిన్నచిన్నవి కొన్ని చేయమంటుంది. ఏమీ అనుకోకుండా, గొణుక్కోకుండా చేసేయ్యండి.
- ఆ తర్వాత డౌన్లోడ్ మొదలవుతుంది. పూర్తయ్యాక రన్ చేయండి. రన్ చేసినప్పుడు ఈ లంకెలో చెప్పిన విధానం అమలు చేయని పక్షంలో మధ్యలో XP CD అడగొచ్చు. ఆడిగితే పెట్టండి.
- ఇన్‌స్టాల్ చేశాక సిస్టమ్ రీబూట్ చేయమంటుంది. చేశాక మీ తెలుగు కంప్యూటర్ సిద్దం అయినట్టే!
అయితే,
అన్నీ తెలుగులో కనబడక పోవచ్చు. చాలా వరకు తెలుగులోనే ఉంటాయి కాని,
విండోస్‌తో రానివి, మీరు స్వయంగా పెట్టుకున్న కొన్ని సాఫ్ట్వేర్లు మాత్రం
ఇంగ్లీషు లోనే ఉంటాయి. విండోస్ లో ఉన్నవాటికే ఒకవేళ తెలుగు పదం లేకపోతే, ఆ పదం తెలుగులో మీకు తెలిస్తే వాళ్ళకు ఇక్కడికి వెళ్ళి మీరే చెప్పొచ్చు. దానికి విండోస్
లైవ్ ఐడి కావాలి. అది ఆ సైటులో ఉచితంగానే పొందవచ్చు. మీరు చెప్పినట్టైతే
తర్వాత వచ్చే వర్షన్ లో ఆ పదం పెడతారు. లేదంటే అది వాళ్ళ దృష్టికి వెళ్ళక
ఎప్పటికీ అనువాదం కాకపోవచ్చు.
0 comments:
Post a Comment