లక్ష్యం: 
అన్నిటికంటే ముందు, ఇదిగో ఈ కింద చెప్పిన విధంగా చేస్తే, XP లో ఏ అక్షరాలయినా మృదువుగా, సుతారంగా, అందంగా కనబడతాయి.
ఇక XPలో తెలుగు చదవడానికి, స్టోర్ చేయడానికి ఈ క్రింది రెండు పద్దతుల్లో మీకు సరిపోయేది ఎంచుకుని చేసేయ్యండి. ఒక పద్దతిలో XP ది ఎదో ఒక CD ఉండాలి. ఇంకోదాంట్లో ఇంటర్నెట్ సదుపాయం ఉండాలి. మొదటిది CD ఉన్న వాళ్ళకి. ఒకవేళ CD లేదు, ఇంటర్నెట్ సదుపాయం ఉంది అంటే ఇక్కడ నొక్కండి. రెండూ లేకపోతే, ఇక్కడ నొక్కండి.
ఆ తెరుచుకున్న విండోలో, క్రింద బొమ్మలో చూపించినట్టు భాషలు(Languages) అనే ట్యాబ్ మీద నొక్కండి.

ఈ పాఠ్యాంశంలో విండోస్ లో తెలుగు సరిగ్గా కనబడడానికి ఏం చేయాలో
తెలుసుకుందాం. ఐతే ఎక్స్.పీ లో ఏమీ చెయ్యక్కర్లేకుండానే తెలుగు
బ్రహ్మాండంగా కనబడుతుంది. కానీ కాపీ చేసీ, పేస్ట్ చేసి, సేవ్ చేసి ఆ ఫైల్
మళ్ళీ తెరిస్తే ఆ పేస్ట్ చేసిన అక్షరాలు ఏవో పిచ్చిపిచ్చిగా కనిపిస్తాయి.
అది ఎందుకో కూడా చూద్దాం. ఇలాంటి విషయాలు నిశితంగా తెలుసుకోవాలనుకుంటే అసలు
ఖతులు(ఫాంట్లు) అంటే ఏంటో కూడా తెలుసుకుందాం.
- Desktop మీద right click చేసి
- Settings ఎంచుకుని
- Appearence లో effects క్లిక్ చేసి
- "Use the following method to smooth edges of screen fonts" అన్నదాన్ని "ClearType" కి మార్చండి.
- అన్నీ Ok కొట్టేస్తే తేడా మీకే తెలుస్తుంది.
ఇక XPలో తెలుగు చదవడానికి, స్టోర్ చేయడానికి ఈ క్రింది రెండు పద్దతుల్లో మీకు సరిపోయేది ఎంచుకుని చేసేయ్యండి. ఒక పద్దతిలో XP ది ఎదో ఒక CD ఉండాలి. ఇంకోదాంట్లో ఇంటర్నెట్ సదుపాయం ఉండాలి. మొదటిది CD ఉన్న వాళ్ళకి. ఒకవేళ CD లేదు, ఇంటర్నెట్ సదుపాయం ఉంది అంటే ఇక్కడ నొక్కండి. రెండూ లేకపోతే, ఇక్కడ నొక్కండి.
CD ఉన్న వాళ్ళైతే
- నియంత్రణ ఫ్యానల్ లో తేదీ, సమయం, భాష మరియు ప్రాంతీయ ఎంపికలు లో ప్రాతీయం, భాష ఎంపికలు (Control Panel లో Date, Time Language and Regional Settings లో Regional and Language settings) కి వెళ్ళండి
ఆ తెరుచుకున్న విండోలో, క్రింద బొమ్మలో చూపించినట్టు భాషలు(Languages) అనే ట్యాబ్ మీద నొక్కండి.
- అక్కడ పైన చూపిన విధంగా టిక్కు పెట్టని రెండు బాక్సులుంటాయి. వాటిని టిక్ చేసేసి OK కొట్టేయండి. CD పెట్టమని అడుగుతుంది, పెట్టేసి OK అని కొట్టేయండి.
- అంతా అయిపోయాక CD తీసేసి కంప్యూటర్ని రీబూట్ చేయండి.
- ఏదైన తెలుగు వెబ్‌సైట్ కి వెళ్ళి చూడండి. మీరు ఇక మీ కంప్యూటర్లో తెలుగు నిక్షేపంగా చదువుకోవచ్చు, స్టోర్ చేస్కోవచ్చు.
ఒకవేళ CD లేకపోతే, ఇంటర్నెట్ సదుపాయం ఉంటే
- ఈ లంకె నొక్కి పోతన, వేమన ఫోంట్లు దించుకోండి.
- దించుకున్నాక, దాన్ని unzip చేస్తే వచ్చే Pothana2000.ttf మరియు vemana.ttf లను C:\Windows\Fonts లోకి copy చేయండి.
- ఏదైన తెలుగు వెబ్‌సైట్ కి వెళ్ళి తెలుగు చదవడం మొదలెట్టండి.
0 comments:
Post a Comment